Viral Video: యువతి డ్యాన్స్‌ చూస్తూ స్విమ్మింగ్‌పూల్లో పడిపోయిన వ్యక్తి..! వీడియో చుస్తే నవ్వు ఆగదు అంతే..!

|

May 15, 2022 | 9:51 AM

అందమైన ఫోటోలు, అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు..ఎవరైనా సరే, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతుంటారు..అలాంటి సీనే ఇక్కడో యువకుడు ఎదుర్కొన్నాడు..ఓ బ్యూటీఫుల్‌ కపుల్‌ ఇక్కడ అంతే అందంగా డ్యాన్స్‌ చేస్తున్నారు.


అందమైన ఫోటోలు, అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు..ఎవరైనా సరే, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతుంటారు..అలాంటి సీనే ఇక్కడో యువకుడు ఎదుర్కొన్నాడు..ఓ బ్యూటీఫుల్‌ కపుల్‌ ఇక్కడ అంతే అందంగా డ్యాన్స్‌ చేస్తున్నారు. ఆ జంటలోని యువతి డ్యాన్స్‌ చూసిన అతడు..మైమరిచిపోయాడు..పరిసరాలను మర్చిపోయి..మైకంలో పక్కనే ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు..ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చూస్తున్నారుగా, ఇక్కడేదో పార్టీ అవుతున్నట్టుగా ఉంది..డిన్నర్‌లో వైట్ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో యువతి తన పార్ట్‌నర్‌తో కలిసి అందంగా డ్యాన్స్ చేస్తోంది. డైనింగ్ టేబుల్ పై కూర్చున్న చాలామంది వీరి డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ జంటకు కాస్త దూరంలో చేతిలో గ్లాస్‌ పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి వీరి డ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. తన చుట్టూ ఏముందో కూడా మర్చిపోయి అతను ఎంజాయ్ చేశాడు. అలా వారి డ్యాన్స్ చూస్తూ అతను నడుచుకుంటూ ముందుకెళ్లాడు. ఈ క్రమంలో తన ముందు ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనే విషయాన్ని అతను గమనించలేకపోయాడు. అలా ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు.ఆ తర్వాత విషయం తెలిసి అందరూ గొల్లున నవ్వారు.ఈ జంట డ్యాన్స్ ను వీడియో తీస్తున్న లేడీ ఫోటో గ్రాఫర్ కూడా తన పని ఆపేసింది.ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో పడిన వ్యక్తిని చూస్తూ ఉండిపోయింది. అనంతరం జంట డ్యాన్స్ వదిలేసి స్విమ్మింగ్ పూల్ లో పడిన వ్యక్తిని ఫొటో తీసింది. ఇలా ఈ షో మొత్తంలో అతడే హైలెట్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 15, 2022 09:51 AM