
Viral Video: సాధారణంగా కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేశామంటే ఆ సందర్భాన్ని మధుర క్షణంగా భావిస్తాం. ఆ వస్తువును కొనుగోలు చేసిన రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా డైరీలో రాసుకోవడం లేదా స్నేహితులకు చిన్న పార్టీ ఇచ్చిన సంబురపడుతుంటాం. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. చిన్న సంతోషాన్ని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు నెట్టింట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పని ఏంటనేగా మీ సందేహం..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి కుష్వాహా అనే వ్యక్తి టీస్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల తన కూతురు స్మార్ట్ ఫోన్‌ను కొనించమని అడిగింది. అయితే ఫోన్ కొనిచ్చే సమయంలో అందరికీ తెలిసేలా నీ మొబైల్ ఫోన్‌ను ఇంటికి తీసుకొస్తానని కూతురికి మాటిచ్చాడు. దీంతో కూతురి కోరిక మేరకు తాజాగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన మురారి కూతురికిచ్చిన మాట మేరకు మొబైల్ షాప్ నుంచి ఇంటి వరకు పెద్ద ర్యాలీ తీశాడు. ఇది అలాంటిలాంటి ర్యాలీ కాదు.
గుర్రపు బండిపై కూతరును కూర్చొబెట్టుకొని చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దారి మధ్యలో డీజే చప్పుల్లు, బ్యాండ్ బాజాలతో హంగామా చేశాడు. ముందు ఏదో పెళ్లి భరాత్ అని అనుకున్న ప్రజలు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనంతటినీ అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
A tea seller welcomed the new mobile in such a way that it became a topic of discussion
Wow took it to the house with bandwagon and buggy after putting the mobile
it is not working whether the wife brought or #Apple
ONE YEAR OF SAAKK #ShehnaazGiIl #MyntraIsIndiasFashionExpert pic.twitter.com/cMiOzJkz7w— Salma Akhtar (@Salma1Akhtar) December 21, 2021
Also Read: Tollywood Heroes With Beard: బియర్డ్ స్టైల్‌తో రచ్చ చేస్తున్న తెలుగు హీరోలు
Dharmasthali: షకలక శంకర్ హీరోగా రానున్న ‘ధర్మస్థలి’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్