Sameera Sherief: ఫ్లైట్‌లో బిడ్డకు పాలిస్తూ వీడియో షేర్ చేసిన ప్రముఖ యాంకర్‌..! వీడియో వైరల్..

Edited By:

Updated on: Jan 17, 2023 | 9:15 AM

మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందంటారు. అందుకే పెళ్లైన ప్రతి అమ్మాయి తల్లిగా మారాలనుకుంటోంది. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటుంది. ప్రస్తుతం ఇదే


మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందంటారు. అందుకే పెళ్లైన ప్రతి అమ్మాయి తల్లిగా మారాలనుకుంటోంది. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటుంది. ప్రస్తుతం ఇదే మధురానుభూతితో మురిసిపోతుంది ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సమీరా షెరీఫ్. సీనియర్‌ నటి సన కుమారుడు అన్వర్‌తో ఆమెకు 2019లో వివాహమైంది. ఆ తర్వాత తమ దాంపత్య బంధానికి గుర్తింపుగా సెప్టెంబర్ 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పిల్లాడి ఆలనాపాలనా చూసుకుంటూ మాతృత్వపు అనుభూతిని మనసారా ఆస్వాదిస్తోంది యాంకర్ సమీరాఫ్. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి సంకోచిస్తుంటారు చాలామంది తల్లులు. అందుకు వారు ధరించిన దుస్తులతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా కారణమవుతాయి. అయితే పిల్లాడి ఆకలి ముందు ముందు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తూచ్‌ అంటూ ఫ్లైట్‌లో బిడ్డకు పాలిచ్చింది సమీరా షరీఫ్‌. తన బిడ్డకు విమానంలో పాలిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లందరూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Loading...
Unable to load recommendations.
Follow Us