Plane: నా బ్యాగులో బాంబు.. ప్రయాణికుడి బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండైన విమానం.
బాంబు బెదిరింపు రావడంతో పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ముంబయి విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమానం శనివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ‘నా బ్యాగులో బాంబు ఉంది’ అంటూ ఒక ప్రయాణికుడు బెదిరించడంతో ఉదయం ముంబయిలో దిగింది. ఆ వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌కు సిబ్బంది సమాచారం అందించారు.
బాంబు బెదిరింపు రావడంతో పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ముంబయి విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమానం శనివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ‘నా బ్యాగులో బాంబు ఉంది’ అంటూ ఒక ప్రయాణికుడు బెదిరించడంతో ఉదయం ముంబయిలో దిగింది. ఆ వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌కు సిబ్బంది సమాచారం అందించారు. ఈ బెదిరింపులకు దిగిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులో తీసుకొని, బ్యాగును తనిఖీ చేయగా.. అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. విమానయాన సంస్థ ఓ ప్రకటనలో .. 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమానానికి టేకాఫ్ అయిన వెంటనే భద్రతాపరమైన హెచ్చరిక రావడంతో.. వెంటనే ముంబయికి దారి మళ్లించాం. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది అని తెలిపింది . సదరు ప్రయాణికుడి బంధువు కూడా విమానంలో ఉన్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుడి మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని నిర్ధారించిన తర్వాత విమానం ఢిల్లీకి వెళ్లిపోయిందని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..