Woman in Metro: అయ్యాయో వీడియో ఏంటి ఇలా ఉంది.. ట్రైన్‌లో దారుణం.. మహిళను కిందపడేసి పిడిగుద్దులు..
మెట్రో ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై దారుణంగా దాడి చేశాడు. మహిళను కిందపడేసి మరీ పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన హాంకాంగ్‌లో చోటుచేసుకుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో హాంకాంగ్‌లోని ఎంటీఆర్ ట్రైన్‌లోని ఓ బోగీలో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఒక్కసారిగా అక్కడ బ్లాక్ డ్రస్ వేసుకొని ఉన్న మహిళపై విరుచుకుపడ్డాడు. పిడిగుద్దులతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మరో వ్యక్తిని వారిని విడిపించేందుకు ప్రయత్నించినా అతను వెనక్కు తగ్గలేదు. మహిళ తిరిగి అతనిపై దాడిచేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ట్రైన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ దాడి క్రమంలో పలువురు కింద పడిపోయారు. ఘటనపై ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అయితే ఈ గొడవకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను 2 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్‌చేస్తూ.. రకరకాల కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 01, 2023 09:39 AM