China: చస్తే చావండి.. బయటకు మాత్రం పోనివ్వం..! ఐసోలేషన్‌లో చిక్కుకున్న ప్రజలు..

|

Sep 13, 2022 | 9:21 AM

దుర్మార్గానికి పరాకాష్ట అంటే ఇదేనేమో. ఓ వైపు భూకంపం ప్రజలను భయపడుతుంటే.. వాళ్లను ఎటూ వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది...


దుర్మార్గానికి పరాకాష్ట అంటే ఇదేనేమో. ఓ వైపు భూకంపం ప్రజలను భయపడుతుంటే.. వాళ్లను ఎటూ వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.అయితే భూకంపం సమయంలోనూ లాక్‌డౌన్‌, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లను బయటకు వదల్లేదు అక్కడి ఆరోగ్య సిబ్బంది. పైగా బిల్డింగ్‌ కూలితే ఇందులోనే చావాలే తప్ప.. బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్‌ హ్యాండిల్స్‌ నుంచే వైరల్‌ కావడం విశేషం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది. అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్‌ తర్వాతే ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే.. పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు.కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతోంది. అయితే.. చైనాలో జీరో-కొవిడ్‌ పాలసీ కఠినాతీకఠినంగా అమలు అవుతోంది. చైనాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్‌.. ఐసోలేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ దెబ్బకు జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో దారుణం బయటపడింది. చైనాలో సెప్టెంబర్‌ 7న భారీ భూకంపం సంభవించింది. అది రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రత చూపించింది. 2017 తర్వాత సిచువాన్‌ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది. కనీసం 50 మంది దాకా మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 13, 2022 09:08 AM