Viral: హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా లేవుగా.. వీడియో.

Updated on: Dec 18, 2024 | 5:59 PM

మనుషులైతే పక్కకు జరగమని చెప్పి వెళ్తాం. అదే జంతువులైతే వాటిని బెదిరించి, అక్కడినుంచి వాటిని వెళ్లగొట్టి అప్పుడు మనం వెళ్తాం. కానీ ఓ ఏనుగు తను వెళ్తున్న దారిలో అడ్డంగా నిలబడి ఉన్న ఓ వ్యక్తిని.. సార్‌.. ఇలా దారికి అడ్డంగా నిలబడితే ఎలా.. కాస్త సైడ్‌ ఇవ్వండి ప్లీజ్‌.. మేం ఇటే వెళ్లాలి అన్నట్టుగా సిగ్నల్‌ ఇచ్చింది. వెంటనే వెనక్కు తిరిగి చూసిన అతను షాకయి అక్కడి నుంచి పక్కకు పరుగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. ఓ వ్యక్తి ఒక ఇంటి ముందు.. దారిలో నిలబడ్డాడు. అంతలోనే ఓ పెద్ద ఏనుగు వెనుక వైపు నుంచి వచ్చింది. అది గమనించని వ్యక్తి అలాగే అక్కడే నిలబడి ఉన్నాడు. దగ్గరి దాకా వచ్చిన ఏనుగు… అతడిని ఏమీ చేయలేదు. అలాగని ఎలాంటి శబ్దం కూడా చేసి భయపెట్టలేదు. సింపుల్ గా తన కాలితో కింద మట్టిని కాస్త ముందుకు తన్నింది. తన పక్కనుంచి మట్టి ఎగిసిపడటం చూసిన వ్యక్తి… ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు. ఏనుగు కనబడటంతో భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. ఆ ఏనుగు హాయిగా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అడవిలో ఉండే ఏనుగు ఎంత పద్ధతిగా వ్యవహరించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆ ఏనుగు అతడిని భయపెట్టాలనుకోలేదు. కానీ తానే ఒక్కసారిగా భయపడ్డాడు…’ అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us