Couple Stunt: స్టంట్‌ చేసి ఫేమస్‌ అవ్వాలనుకున్న జంట.. చివరికి దిమ్మతిరిగి బొమ్మ కనపడిందిగా..

|

Jul 03, 2023 | 9:43 AM

ఇటీవల సోషల్‌ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలామంది రకరకాల స్టంట్స్‌ చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తూ వ్యూస్‌, లైక్స్‌ చూసుకుని మురిసిపోతున్నారు. ఇదో క్రేజ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఓ జంట బైక్‌పైన వెళ్తూ స్టంట్‌ చేయాలనుకున్నారు.

ఈ వీడియోలో బైక్ పైన ఓ జంట రయ్..య్‌.. మంటూ దూసుకుపోతోంది. బైక్ నడిపే వ్యక్తి వెనుక గర్ల్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టుకున్నాడు. హ్యాండిల్ తో ముందు చక్రాన్ని గాల్లోకి లేపుతూ ముందుకు పోనిస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. మధ్యలో ఓసారి హ్యాండిల్‌ వదిలేశాడు. అప్పుడు కూడా ఓకే.. మేనేజ్‌ చేయగలిగాడు. ఈసారి మరింత పైకి లేపే ప్రయత్నం చేశాడు. అతి ఎప్పుడైనా అనర్థమే కదండీ.. అదే జరిగింది. ఉన్నట్టుండి బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. వెనుక కూర్చున్న మహిళ అలానే బలంగా రోడ్డుపైన టపీమని పడిపోయింది. ఆమె కిందపడిన ధాటికి దీని బ్యాక్‌ ఎముకలు దెబ్బతినే ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చేరడంతో వైరల్ గా మారిపోయింది. దీనిపై ఢిల్లీ పోలీసులు సైతం స్పందించారు. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేస్తూ ‘నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల ప్రమాదం కొని తెచ్చుకోవడం’అంటూ ట్వీట్ చేశారు. వేగం థ్రిల్ ను ఇవ్వొచ్చు.. కానీ అదే వేగం కిల్ చేస్తుందని మర్చిపోవద్దు అంటూ ఓ నెటిజన్ తనదైనశైలిలో హితబోధ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...