Viral: విమానం ఢీకొని ఫ్లెమింగోల మృతి.. దెబ్బ తిన్న ఫ్లైట్

దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పక్షులు రావడం సందడి చేయడం చూస్తాం. కొల్లేరు మంచి నీటి సరస్సులోని పచ్చని చెట్లపై వలస పక్షులు చేసే విన్యాసాలు ప్రతి ఏటా అక్కడివారికి సుపరిచితమే. కొల్లేరు సహజ మత్స్య సంపదకు ఆలవాలంగా ఉండటంతో సైబీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏటా అక్కడికి వస్తుంటాయి. అక్టోబరు నెలాఖరు నుంచి ఫిబ్రవరి చివరి వరకు పక్షులతో సందడిగా మారడం చూస్తాం.

Viral: విమానం ఢీకొని ఫ్లెమింగోల మృతి.. దెబ్బ తిన్న ఫ్లైట్

|

Updated on: May 24, 2024 | 1:39 PM

దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పక్షులు రావడం సందడి చేయడం చూస్తాం. కొల్లేరు మంచి నీటి సరస్సులోని పచ్చని చెట్లపై వలస పక్షులు చేసే విన్యాసాలు ప్రతి ఏటా అక్కడివారికి సుపరిచితమే. కొల్లేరు సహజ మత్స్య సంపదకు ఆలవాలంగా ఉండటంతో సైబీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏటా అక్కడికి వస్తుంటాయి. అక్టోబరు నెలాఖరు నుంచి ఫిబ్రవరి చివరి వరకు పక్షులతో సందడిగా మారడం చూస్తాం. ప్రతి వేసవిలో నవీ ముంబై పరిసరాల్లోని చిత్తడి ప్రాంతాలతో పాటు థానే క్రీక్‌కు ఫ్లెమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి. అయితే ఫ్లెమింగోలు తాజాగా ఊహించని ప్రమాదానికి గురయ్యాయి.

ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు మృతి చెందాయి. ఇవన్నీ ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లెమింగో గుంపును ఢీకొట్టింది. దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. చచ్చిపడిన ఫ్లెమింగోలను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్‌కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కళేబరాలను తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షల కళేబరాల కోసం గాలించారు. అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి పంపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us