బంగ్లాదేశ్‌లో 'గంగ'ని ఏమని పిలిస్తారో తెలుసా.?
TV9 Telugu
26 June 2024
భారతదేశంలో గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందువులు ఈ నదిని పూజిస్తారు.
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా గంగ నది ప్రవహిస్తోంది. దాని పేరే బురి గంగ. ఒకప్పుడు ఈ నది ఆ దేశానికి జీవనాడి.
బురి గంగా నది బంగ్లాదేశ్ దేశ రాజధాని అయినా ఢాకాకు నైరుతి దిశలో ప్రవహిస్తుంది. దీని గురించి కొన్ని తెలుసుకుందాం.
బురి గంగా నది సగటు లోతు 7.6 మీటర్లు (25 అడుగులు), గరిష్ట లోతు 18 మీటర్లు (58 అడుగులు)గా ఉంటుందని అంచనా.
ఒకప్పుడు బురి గంగ ఈ ప్రాంతానికి జీవనాడి. ఈ నదిలో చేపలు పట్టి వందలాది మంది ప్రజలు జీవనోపాధి పొందేవారు.
మొఘల్ కాలంలో బురిగంగ తీరం వాణిజ్యానికి ముఖ్యమైన ప్రదేశం. ఈ నది ఢాకా నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా కూడా ఉండేది.
నేడు బురి గంగ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇది చాలా కలుషితమైంది. వర్షాకాలం మినహా నది నీరు నల్లగా కనిపిస్తుంది.
బంగ్లాదేశ్‌లోని అత్యంత కలుషితమైన నదులలో ఒకటి. బురిగంగ ఢాకాకు సమీపంలోని సవార్‌కు దక్షిణాన ధళేశ్వరిలో ఉద్భవించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి