రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్‌ కోబ్రాలు..

Updated on: Aug 17, 2026 | 6:15 PM

అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌ కోబ్రా మరో పామును మింగుతూ రేకుల షెడ్‌లో ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. కుర్మానాధపురంలో రైతు షెడ్‌లో కనిపించిన సుమారు 13 అడుగుల రాచనాగును స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌ రెండు గంటలు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అదే రోజు ఖండివరంలో మరో 12 అడుగుల గిరినాగును కూడా పట్టుకున్నారు. అటవీశాఖ అధికారుల సమక్షంలో రెండు పాములను రిజర్వ్‌ అడవిలో విడిచిపెట్టారు.

కింగ్‌ కోబ్రా… పేరు వింటేనే గడగడలాడిపోతారు. అలాంటి కింగ్‌ కోబ్రా మరో విషనాగును మింగుతూ కనిపిస్తే… వెన్నులో వణుకు పుడుతుంది కదా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది అనకాపల్లి జిల్లాలో. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన కింగ్ కోబ్రా మరో పామును ఆహారంగా మింగుతూ ఓ రేకుల షెడ్‌లో ఇరుక్కుపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విశాఖ..వి.మాడుగుల మండలం కుర్మానాధ పురానికి చెందిన రైతు సిరిమిరి శెట్టి దొరబాబు పొలంలోని రేకుల షెడ్‌లో ఏకంగా 13 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. ఆహారం కోసం సంచరిస్తూ మరొక సర్పాన్ని సజీవంగా మింగుతున్న క్రమంలో, అది షెడ్డు రేకుల మధ్య ఇరుక్కుపోయింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన రైతుకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది..భయంతో వణికిపోయాడు. వెంటనే తేరుకొని స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ సుమారు రెండు గంటల పాటు శ్రమించి, రాచనాగు కడుపులో ఉన్న మరో పామును సురక్షితంగా బయటకు కక్కించేలా చేసి, ఆ మూగజీవానికి ప్రాణం పోశారు. అనంతరం ఆ 13 అడుగుల భారీ రాచనాగును చాకచక్యంగా బంధించారు. మరోవైపు, ఇదే జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరో 12 అడుగుల భారీ గిరినాగు పొలంలో సంచరిస్తూ ప్రజలను హడలెత్తించింది. సమాచారం అందుకున్న అదే స్నేక్ క్యాచర్ వెంకటేష్ అక్కడకు చేరుకుని ఆ భారీ నాగును కూడా ఎంతో నైపుణ్యంతో బంధించారు. అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఈ రెండు భారీ గిరినాగులతో పాటు, రక్షించిన మరో పామును కూడా సమీపంలోని దట్టమైన రిజర్వ్ అడవుల్లో సురక్షితంగా విడిచిపెట్టారు. ఒకే రోజు రెండు భారీ రాచనాగులు హల్చల్ చేయడం, అందులోనూ ఒక పామును మరో పాము మింగుతూ ఇరుక్కుపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్నేక్ క్యాచర్ వెంకటేష్ చూపిన సాహసాన్ని అంతా అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పసిడి ధర పైపైకి..ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంత పెరిగిందంటే!

ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!

రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం

హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఇడ్లీ-సాంబార్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us