Video: గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా

Updated on: Mar 20, 2026 | 9:13 AM

కొప్పల్ జిల్లా బసాపుర గ్రామ సమీపంలో తుంగభద్ర ఎడమ గట్టు కాలువకు భారీ గండి పడింది. కాలువ నీరు పొలాలు, రిసార్టుల్లోకి చేరగా, అదే సమయంలో స్థానికులకు సుమారు 20 కిలోల బరువున్న భారీ చేప దొరికింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగైదు జిల్లాల తాగునీరు, సాగునీటి అవసరాలకు కీలకమైన తుంగభద్ర రిజర్వాయర్ ఎడమ గట్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. తాగునీటి అవసరాల కోసం అధికారులు కాలువకు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొప్పల్ తాలూకాలోని బసాపుర గ్రామ సమీపంలో ఈ కాలువ తెగిపోయింది. కాలువ నుంచి వెలువడిన భారీ నీటి ప్రవాహం పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి, రిసార్టుల్లోకి ఉధృతంగా దూసుకువెళ్లింది. మొత్తం నాలుగు జిల్లాలకు తాగునీటి సరఫరా కోసం ఈ నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. కాలువ తెగి నీరు బయటకు వస్తున్న సమయంలో స్థానికులకు ఒక ఊహించని అదృష్టం తగిలింది. వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన ఒక భారీ చేప స్థానికుల వలకు చిక్కింది. సుమారు 15 నుండి 20 కిలోల బరువున్న ఈ చేపను చూసి స్థానికులు విస్తుపోయారు. కాలువ తెగిపోయిందన్న ఆందోళనలో ఉన్నప్పటికీ, అంత పెద్ద చేప దొరకడంతో గ్రామస్థులు దాన్ని పట్టుకుని.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us