Viral Video: ఎంతకు తెగించార్రా.. దొంగలు ఏం దొబ్బేశారో తెలిస్తే బిత్తరపోతారు..
డబ్బులు, బంగారం, గోల్డ్.. లేదా ఇంకా ఏదైనా కాస్ట్లీ వస్తువులను దొంగలు దొబ్బేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఓ ఇద్దరు దొంగలు మాత్రం ఏం దొంగలించారో తెలిస్తే.. మీ మైండ్ దొబ్బడం ఖాయం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వింత సంఘటన వెలుగు చూసింది. ఓ ఇద్దరు దొంగలు రాత్రి వేళలో దొంగతనానికి వచ్చారు. దొంగతనానికి వచ్చిన ఆ ఇద్దరు.. డ్రెయిన్‌పై కప్పి ఉంచిన ఇనుప మూతను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను తీక్షణంగా చూస్తే.. ఇద్దరు వ్యక్తులు డ్రెయిన్ మూతను ఎత్తుతున్నట్టు మీరు చూడవచ్చు. ఇక ఇంతలో మరొక వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి.. ఆ ఇద్దరు దొంగలకు సాయం చేశాడు. ఇద్దరు దొంగలు ఇనుప మూతను రిక్షాలో ఎక్కించగా.. అక్కడి నుంచి ముగ్గురు దెబ్బకు పరార్ అయ్యారు. ఆగష్టు 2న అర్ధరాత్రి వేళ స్థానిక గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని లాల్ కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

