పోరాటాల పురిటిగడ్డపై సరికొత్త ఉద్యమం !!

Updated on: Apr 08, 2026 | 3:12 PM

మహబూబాబాద్ జిల్లాలోని 38 గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. హెల్మెట్ తప్పనిసరి, సీసీ కెమెరాల నిఘా, గంజాయి రహిత ఉద్యమంతో ఈ పల్లెలు భద్రతకు కొత్త అర్థం చెబుతున్నాయి. గ్రామసభ తీర్మానాలు, పోలీసుల సహకారంతో ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలు, నేరాలను తగ్గిస్తున్నారు. ఈ త్రిముఖ వ్యూహం ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది.

ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేరాఫ్ మానుకోట… ఆ పోరాటాల పురిటిగడ్డ పై ఇప్పుడు సరికొత్త సంకల్ప ఉద్యమం మొదలైంది.. ఊళ్లన్నీ ఏకమయ్యాయి..ఆ గ్రామాల్లో ఒకే మాట ఒకే బాట… గ్రామసభ తీర్మానాలే శాసనాలుగా ఆచరిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి గ్రామాల్లోకి నో ఎంట్రీ… అక్షరజ్ఞానం లేనివారు కూడా ఆ గ్రామాల్లో లక్షణంగా హెల్మెట్ నిబంధనలు పాటిస్తున్నారు. ఊరంతా cc కెమెరా నిఘా.. గంజాయి గ్రామ పొలిమేరల్లోకి రానివ్వరు.. ఈ మూడు సూత్రాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ దేశానికి స్పూర్తిగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 38 గ్రామాలలో 100% వాహనదారులు హెల్మెట్ ధరించి దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి అలైవ్.. అరైవ్.. అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కాబోతుంది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తన సిబ్బంది సహకారంతో జిల్లాలోని గ్రామ సర్పంచ్ లకు అవగాహన సదస్సులు నిర్వహించారు. దండోరా వేయించారు.. మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.. హెల్మెట్ వినియోగం, సీసీ కెమెరాలు పర్యవేక్షణ, గంజాయి వల్ల కలిగే లాభనష్టాలపై సర్పంచ్ లను చైతన్య పరిచారు.. జిల్లావ్యాప్తంగా పోలీసులు డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి ద్విచక్ర వాహనాలు, కార్ల సంఖ్య తేల్చారు.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని గ్రామ సభ తీర్మానంలో డిసైడ్ చేశారు.. హెల్మెట్ లేని వారిని గ్రామ పొలిమేరల్లోకి రానివ్వరు.. గ్రామ శివారులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమంది యువకులు విధులు నిర్వహిస్తున్నారు.. హెల్మెట్ లేని వారిని ఆ గ్రామంలోకి అనుమతించడం లేదు.. హెల్మెట్ ధరించడం భయంతోనో భక్తితోనే కాదు బాధ్యతగా భావించాలి అంటున్న ఆ గ్రామాల సంకల్పంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు.. హెల్మెట్ నిబంధన సంపూర్ణంగా ఆచరించడం మాత్రమే కాదు.. ఈ గ్రామాల్లో అణువణువు మూడో కన్ను నిఘా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. గ్రామ పొలిమేరలను మొదలుకొని ఊరంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఆ కెమెరాను సర్పంచ్ మొబైల్ తో పాటు గ్రామపంచాయతీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు స్థానిక పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేశారు.హెల్మెట్ నిబంధన మాత్రమే కాదు, క్రైమ్‌ రేట్ కు కారణం అవుతున్న అతిపెద్ద మహమ్మారి గంజాయి నిర్మూలన కూడా ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు 80 శాతం మరణాలు ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మనిషి అవయవాల్లో తల భాగం అత్యంత సున్నితమైనది. తల కూడా ఒకరకంగా కోడు గుడ్డు లాంటిదే.. కోడిగుడ్డు పగిలితే ఎలా అతకదో ప్రమాద సమయంలో మనిషి తలకు బలమైన దెబ్బతాకితే ఆ మనిషి బ్రతికే ఛాన్స్ ఉండదు. జిల్లా పోలీసుల పిలుపుతో 38 గ్రామాలు యజ్ఞంలా ఈ మూడు సూత్రాలు ఆచరిస్తున్నారు.. ఈ గ్రామాలను స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని గ్రామాల్లో కూడా అదే బాటలో నడుస్తున్నాయి. త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తో మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు.. ఉద్యమమైన ఉక్కు సంకల్పమైన ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది.. ఈ జిల్లాలో మొదలైన మూడు సూత్రాల అమలు జరుగుతున్నాయి.. రాష్ట్రమంతా ఇదే విధంగా పోలీసులు కర్తవ్యంగా.. ప్రజలు బాధ్యతగా ఆచరిస్తే ప్రమాదాలు దరి చేరవు.. నేరాలు గ్రామ పొలిమేరలోకి అడుగుపెట్టవు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్‌

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరి.. చరిత్ర సృష్టించిన టీచర్‌

అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??

ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??

బురఖాలో వచ్చింది.. గన్‌ బయటకు తీసింది.. ఆ తర్వాత..

Follow Us