Telangana Rising Global Summit LIVE: తెలంగాణలో భారీగా పెట్టుబడులు.. రెండో రోజు కొనసాగుతున్న గ్లోబల్​ సమ్మిట్‌‌..

Updated on: Dec 09, 2025 | 10:41 AM

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్‌ మహీంద్రాతో EV​, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్‌ మహీంద్రాతో EV​, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది. సా.6 గంటలకు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించనున్నారు. రా.7 గంటలకు డ్రోన్‌ షోతో గ్లోబల్‌ సమ్మిట్ ముగింపు జరగనుంది.

తెలంగాణలో రూ.5 లక్షల కోట్లకు చేరువలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. నేటి సమ్మిట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ.. నైట్ సఫారీ ఏర్పాటుకు ‘వంతార’ గ్రూప్ ముందుకొచ్చింది.

Published on: Dec 09, 2025 10:40 AM