ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఇళ్లు. నిరు పేదలకు సొంతింటి నిర్మాణమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకంపై ఆది నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అర్హులైన లబ్ధిదారులను కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తించిన వారికి ఇండ్లు మంజూరు చేశారాన్ని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా వారికి కూడా మళ్లీ ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయించారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఇళ్లు. నిరు పేదలకు సొంతింటి నిర్మాణమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకంపై ఆది నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అర్హులైన లబ్ధిదారులను కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తించిన వారికి ఇండ్లు మంజూరు చేశారాన్ని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా వారికి కూడా మళ్లీ ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయించారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ దారుణ సంఘటన మరో ఎత్తుగా మారింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ డబ్బులను చెల్లించలేదని లబ్దిదారురాలి భర్తను ఓ కాంట్రాక్టర్ చెట్టుకు కట్టేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సొనాల మండలం కోఠ గ్రామానికి చెందిన లోఖండే మారుతి భార్య పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. సత్యనారాయణ అనే గుత్తేదారుతో ఇంటి నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు మారుతి. పునాది స్థాయి వరకు ఇంటి నిర్మాణం పూర్తయింది. మొదటి దశ పూర్తి కావడంతో లబ్ధిదారుని ఖాతాలో లక్ష రూపాయలు నిధులు జమ అయ్యాయి. ఖాతాలో పడ్డ డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ అగ్రహించి సొనాల మండల కేంద్రంలో లబ్ధిదారురాలి భర్తను చెట్టుకు కట్టేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడికి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై దొరికిన డబ్బు సంచి..
‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
శిరీష్ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్ ఎమోషనల్
