వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మార్పు

|

Feb 08, 2024 | 8:59 PM

తెలంగాణలో వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మారుస్తూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో TG అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 2008 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని స్వయంప్రకటితంగా ప్రకటించుకున్న ఘట్టాన్ని ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. TG స్టిక్కర్స్‌ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగిందని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

తెలంగాణలో వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మారుస్తూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో TG అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 2008 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని స్వయంప్రకటితంగా ప్రకటించుకున్న ఘట్టాన్ని ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. TG స్టిక్కర్స్‌ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగిందని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు తమ వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌కు AP స్థానంలో TG స్టిక్కర్స్‌ అంటించుకుని తిరిగారు. ఈ కార్యక్రమాన్ని దేవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన నవతెలంగాణ పార్టీ మరింత ఉధృతం చేసింది. అనేక మంది వాహనదారులకు అప్పట్లో చలాన్లు కూడా పడ్డాయి. అయినా వెనుకంజ వేయకుండా జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ రాష్ట్రం అని పేర్లు మార్చే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది ఉద్యమకారులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mumbai: ముంబై తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.

గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు

TOP9 ET: RRR రికార్డును బ్రేక్‌ చేసిన యానిమల్ | పవన్‌ ఫ్యాన్స్ ఓవర్‌ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..

Published on: Feb 08, 2024 08:59 PM