జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమా ??
ఎంబ్రియో ఎడిటింగ్ ద్వారా వ్యాధులు లేని, అధిక తెలివితేటలు గల 'డిజైనర్ బేబీలను' సృష్టించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రివెంటిన్ వంటి స్టార్టప్‌లు గర్భస్థ పిండాల జన్యు సవరణతో వంశపారంపర్య వ్యాధులు నివారించి, ఆరోగ్యం పెంచాలని చూస్తున్నాయి. అమెరికాలో అనుమతులు లేనప్పటికీ, యూఏఈలో ప్రయోగాలు జరపడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ విప్లవాత్మక సాంకేతికతపై ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.
పుట్టే పిల్లల్లో వ్యాధులు తక్కువ తెలివితేటలు ఎక్కువైతే ఎంత బాగుంటుందో కదా. ఈ రకమైన పిల్లలను భవిష్యత్‌లో టెక్నాలజీ మన కళ్ల ముందుకు తీసుకురానుంది ఎంబ్రియో ఎడిటింగ్. అంటే వంశపారంపర్య వ్యాధులు లేకుండా, హయ్యర్ ఇంటెలిజెన్స్ తో పుట్టేలా బేబీస్‌ను సృష్టించనున్నారు. దీనికి సంబంధించిన కథనాన్ని అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఆరోగ్యకరమైన ఇంజినీర్డ్ బేబీని ఆవిష్కరించి, ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రివెంటిన్ అనే స్టార్టప్ కంపెనీ ఎంబ్రియో ఎడిటింగ్‌పై పనిచేస్తోంది. సైంటిస్టు లూకాస్ హారింగ్టన్ ఈ స్టార్టప్‌ను స్థాపించారు. ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్‌మాన్, క్రిప్టోకరెన్సీ బిలియనేర్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నారు. పుట్టుకకు ముందే గర్భస్థ పిండానికి జన్యుపరమైన ఎడిటింగ్ చేసి వారసత్వ వ్యాధులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ స్టార్టప్ పనిచేస్తుంది. అయితే అమెరికాలో ఎంబ్రియో ఎడిటింగ్ కు అనుమతులు లేవు. యూఏఈలో ప్రయోగాలు చేయడానికి ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ప్రసవం తర్వాత చేపట్టే చికిత్స కోసం జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వాడతారు. డిజైనర్ బేబీల కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలియగానే ఈ అంశంపై ఆన్‌లైన్‌లో వాడిగా చర్చ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన వాటర్ హీటర్.. వేడినీళ్లు పెట్టుకుంటుండగా..
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
తిరుమలలో అంబానీ కిచెన్.. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా వంటశాల
