ఏఐ గురువులకు ఫుల్ డిమాండ్.. ఒక్క క్లాస్ చెబితే రూ. 23 లక్షల ఫీజు
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఏఐ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉద్యోగులకు ఏఐ టూల్స్ వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఒక్క క్లాస్‌కే దాదాపు రూ.23 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ నైపుణ్యాలు భవిష్యత్తులో అత్యంత విలువైన కెరీర్ అవకాశాలుగా మారుతున్నాయి.
ఒక్క క్లాస్ చెబితే చాలు రూ. 23 లక్షల జీతం పొందొచ్చు. అవునండీ ఇది నిజమే. ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ గురువులకు సైతం డిమాండ్ భారీగా పెరుగుతోంది. కీలక రంగాల్లో ఏఐపై పాఠాలు చెబితే ఒక్క రోజులో ఒక్క క్లాస్ కు 25 వేల డాలర్ల వరకు వెచ్చిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగాన్నిప్రభావితం చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పెద్ద పెద్ద టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని రంగాలు వేగంగా ఏఐని అందిపుచ్చుకుంటున్నాయి. కృత్రిమ మేథలో బేసిక్ టాస్క్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐని వినియోగించుకునేందుకు కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించే విషయంలో ముందు డౌట్ పడ్డ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. ఏఐని అందిపుచ్చుకోకపోతే తాము మార్కెట్ లో వెనకబడిపోతామని భావిస్తున్నాయి. దీంతో ఏఐ వాడేలా తమ ఉద్యోగులను ట్రైన్ చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు కోట్లు వెనకేస్తోంది. అదే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్ . 2025లో వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్‌ను ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ స్థాపించారు. ఆ ఇద్దరు గతంలో సాఫ్ట్ బ్యాంకులో పని చేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్క క్లాస్ చెబితేనే 25 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.23,85,322 వరకు వసూలు చేస్తున్నారని గ్లోబల్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలైన సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటివి వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్ కంపెనీ కస్టమర్ల జాబితాలో ఉన్నాయట. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, గూగుల్ జెమినై టూల్స్ తో తమ రోజు వారీ ఫైనాన్షియల్ టాస్కులను సులభంగా పూర్తి చేయడంలో బ్యాంక్ ఇతర ఆర్థిక కంపెనీల స్టాఫ్‌కు వీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా మంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదు. దాంతో పాత మోడళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించేందుకు భారీ సంఖ్యలో ఏఐ ట్రైనర్ల అవసరం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ విస్తృత వినియోగంలో ఆసియా ముందువరుసలో ఉంది. ఐఎంఎఫ్ విడుదల చేసిన ఏఐ ప్రిపేర్డ్‌నెస్ సూచీలో 174 దేశాల్లో సింగపూర్ తొలిస్థానంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
ఫేక్ కాల్స్ భరతం పట్టనున్న గూగుల్.. ఎలా అంటే!
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే
ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్
చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!