UPI Lite: యుపీఐ లైట్ వినియోగదారులకు శుభవార్త

|

Nov 02, 2024 | 9:57 AM

యూనిఫైడ్​ పేమెంట్స్ ఇంటర్​ ఫేస్​ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ముఖ్యంగా మనం ఎలాంటి బ్యాంక్​ వివరాలు నమోదు చేయకుండానే, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం సహా వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు.

అందుకే తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా యూపీఐ మారిపోయింది. ఈ క్రమంలో యూపీఐకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు కొత్తగా అమల్లోకి వచ్చాయి. నవంబర్ 1 నుండి యూపీఐ లైట్ వినియోగదారులు మరిన్ని చెల్లింపులు చెయ్యవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని కూడా పెంచింది. నవంబర్ 1 తర్వాత మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉంటే, కొత్త ఆటో టాప్-అప్ ఫీచర్ ద్వారా మళ్లీ యూపీఐ లైట్‌కి డబ్బు జోడించవచ్చు. ఇది మాన్యువల్ టాప్-అప్ అవసరాన్ని తొలగిస్తుంది. దీని కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లైట్ సహాయంతో చెల్లింపులను సజావుగా చేయవచ్చు. యూపీఐ లైట్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కొత్త ఫీచర్‌​ను ఇటీవలే తీసుకొచ్చింది. అదే యూపీఐ లైట్ ఆటో టాప్-అప్ ఫీచర్‌. యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఫండ్స్‌ లోడ్‌ అవుతాయి. లిమిట్‌​ను యూజర్లే సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఫీచర్‌​ను తీసుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రష్యాలో ప్రభాస్‌ క్రేజ్‌.. కల్కీ రీ- రిలీజ్

ఫోటోలు తీసే పేరుతో.. హీరోయిన్ పై దారుణ కామెంట్స్

Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.. కిరణ్‌ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా ??

Dulquer Salmaan: తన లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో

బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు