స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్‌ సేఫేనా ??

|

Aug 21, 2024 | 1:59 PM

ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్‌ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదని తెలిసిపోయింది.

ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్‌ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో అసలు నెలల కొద్దీ స్పేస్ స్టేషన్లలో ఎవరైనా ఉండగలరా… ఉంటే వాళ్లకు అక్కడ ఎలాంటి సౌకర్యాలుంటాయి..? ఓ సారి చూద్దాం. నిజానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అమెరికన్ ఫుట్ బాల్ మైదానం అంత ఉంటుంది. అంటే సుమారు ఈ చివర నుంచి ఆ చివరకు 356 అడుగుల పొడవు ఉంటుంది. అందులో 6 స్లీపింగ్ క్వార్టర్స్, 2 బాత్రూంలు. ఒక జిమ్, 360 డిగ్రీల కోణంలో చూపించే ఓ కిటికీ ఉంటాయి. ప్రస్తుతం అందులో సునీత విలియమ్స్, విల్ మోర్ కాకుండా మరో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ అందులో ఉన్నారు. స్పేస్ స్టేషన్లో సొంతంగా ఆక్సిజన్ జనరేట్ చేసే వ్యవస్థ ఉంది. అలాగే మనం విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్‌లోని ఉండే ఆక్సిజన్‌లో 50 శాతం మళ్లీ రీస్టోర్ చేసే సౌకర్యం కూడా ఉంది. అలాగే యూరిన్, చెమట రెండింటినీ రీసైకిల్ చేసి తిరిగి నీరుగా మార్చే వ్యవస్థ కూడా ఉంటుంది. అలాగే హూస్టన్‌లోని స్పేస్ ఫుడ్ సిస్టమ్ లేబరోటరీలో తయారు చేసిన రెడీ టూ ఈట్ మీల్స్ కూడా అవసరమైనంత స్సేస్ స్టేషన్లో అందుబాటులో ఉంటుంది. తాజాగా నాసా యూట్యూబ్ వీడియోలో సునీత తన ఇంటి నుంచి పంపించిన తనకిష్టమైన న్యూటర్ బటర్‌ను చూపించారు. వారికి ఇటీవల కాలంలో చివరిసారిగా ఆగస్టు 6న భూమి నుంచి పంపిన వస్తువులు అందాయి. మే 30న కజికిస్తాన్‌ నుంచి లాంచ్ చేసిన రాకెట్లో వాటిని పంపారు. అలాగే స్పేస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది తమకు ఏవైనా కావాలంటే మిషన్ కంట్రోల్‌కి ఆర్డర్ చెయ్యవచ్చు కూడా. ఆగస్టు 6న వచ్చిన పార్శిల్లో విల్ మోర్‌కి కావాల్సిన బట్టలు వచ్చాయి. అలాగే 2012లో సునీత చేసిన వీడియోలో స్పేస్ స్టేషన్లో ఉంటే టాయిలెట్ వ్యవస్థను మనకు పరిచయం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు

Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్

ఎగాతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా… రవన్న కోసం ఆవేదన

క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ కమెడియన్ ?

CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM రేవంత్ రెడ్డి

Follow us on