ఐఫోన్ యూజర్స్ కు యాపిల్ వార్నింగ్..

|

Feb 24, 2024 | 12:17 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిఒక్కరి చేతిలోనూ మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి అయిపోయింది. ఫోన్‌లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టుగానే మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం వాడే ఫోన్‌ ఏదైనా ఒక్కసోరి ఫోన్ నీటిలో పడినా, తడిసినా దానిని కాపాడుకోడాలని వెంటనే బియ్యం డబ్బాలో పెట్టి ఆరబెడుతుంటారు చాలామంది. ఇకపై అలా చేయొద్దంటున్నారు.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిఒక్కరి చేతిలోనూ మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి అయిపోయింది. ఫోన్‌లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టుగానే మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం వాడే ఫోన్‌ ఏదైనా ఒక్కసోరి ఫోన్ నీటిలో పడినా, తడిసినా దానిని కాపాడుకోడాలని వెంటనే బియ్యం డబ్బాలో పెట్టి ఆరబెడుతుంటారు చాలామంది. ఇకపై అలా చేయొద్దంటున్నారు. అలా చేయడం వల్ల ఫోన్‌కి మరింత నష్టం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఐ ఫోన్‌ వినియోగదారులు ఈ పని అస్సలు చెయ్యొద్దంటోంది యాపిల్‌ సంస్థ. వాటర్లాగ్ అయిన ఫోన్లను సరిచేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించడం మానేయాలని వినియోగదారులను కోరింది. నీటిలో తడిచిన ఐ ఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టవద్దని సూచించింది. అలా చేయడం వల్ల బియ్యంలోని చిన్న రేణువులు ఐఫోన్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. తడిని తుడిచివేసే క్రమంలో హెయిర్ డ్రైయర్లు లేదా కంప్రెస్డ్ వంటివాటిని ఉపయోగించవద్దని తెలిపింది. అలాగే, ఛార్జింగ్ పోర్టుల్లో కాటన్ స్వాబ్లు లేదా పేపర్ టవల్స్ చొప్పించవద్దని టెక్ వివరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటె కన్నీరుతో విషానికి విరుగుడు.. దుబాయ్‌లో శాస్త్రవేత్తల పరిశోధనలు

‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్‌ తెచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో..

అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??