Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

|

Nov 10, 2024 | 12:57 PM

ఇలా నీటిపై కదులుతూ.. అలా గాల్లోకి ఎగురుతూ.. మళ్లీ నీటిపైనే ల్యాండ్ అయ్యే జల విమానం ఇది. ఇంతవరకు మన దేశంలో ఎక్కడా లేదు. భారత్ లో ఫస్ట్ టైమ్.. ఏపీలోనే టేకాఫ్.. ఏపీలోనే ల్యాండింగ్. జస్ట్.. అరగంటలో విజయవాడ నుంచి శ్రీశైలం జర్నీని కంప్లీట్ చేసేసింది. ఒక విమానం.. గాల్లోకి ఎగరాలన్నా.. భూమిపై ల్యాండ్ కావాలన్నా.. దానికి దాదాపు ఐదు వందల ఎకరాల ఎయిర్ పోర్ట్.. రన్ వే అవసరం. కానీ ఈ సీ ప్లేన్ స్పెషల్ ఏమిటో తెలుసా.?

నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం పర్యాటకం మీదే ఆధారపడి బతుకుతున్నాయి. అందుకే భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు.. టూరిజం తప్ప అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంత ఘంటాపథంగా చెప్పగలిగారు. పైగా ఇతర రంగాలతో పోలిస్తే టూరిజంలో వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. దీని మీద చేసే ఖర్చుతో పోలిస్తే.. ఆదాయం దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే రూపాయి ఖర్చు పెడితే.. సుమారు ఆరు రూపాయల ఆదాయం అన్నమాట. అలాంటి బంగారు బాతును ఎవరు వదులుకుంటారు? అందుకే ఇప్పుడు ఇంత వేగంగా.. దేశంలోనే ఫస్ట్ టైమ్.. సీ ప్లేన్ సర్వీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాల్లో ఎగిరేలా చేశారు.

ఎయిర్ పోర్ట్ కట్టాలంటే.. వందలాది ఎకరాలు సేకరించాలి. మౌలిక వసతులు కల్పించాలి. కానీ సీ ప్లేన్స్ కు అవేవీ అవసరం లేదు. ఏరో డ్రోమ్స్ సాయంతో ఎయిర్ ట్రావెల్ చేయచ్చు. ఇక ఉడాన్ స్కీమ్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా అందుబాటులో ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. సో.. టూరిజం శాఖ కాస్త ఫాస్ట్ గా రియాక్ట్ అయితే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందుకునే అవకాశం ఏపీకి ఉంటుంది. ఇప్పటికైతే.. విజయవాడ-శ్రీశైలం రూట్ తో పాటు విజయవాడ నాగార్జున సాగర్, విజయవాడ-హైదరాబాద్ రూట్లు ఫిక్స్ అయ్యాయి. అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతం నుంచి అమరావతికి రూటును కనెక్ట్ చేసే వివిధ ప్రాంతాల్లో స్టేషన్ లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే.. సామాన్యులు ప్రయాణించేలా తక్కువ ఛార్జీలు.. ఎక్కువ సర్వీసులను కల్పించాలి. కాకపోతే.. సీ ప్లేన్ సర్వీస్.. ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటికీ ఏఏ ప్రాంతాల మధ్య ప్రయాణానికి టిక్కెట్ రేటు ఎంత ఉంటుందో క్లారిటీ వస్తుంది. దీనిపై స్పష్టత వస్తే.. సీ ప్లేన్ సర్వీసులు.. ఏపీలో చాలా చోట్ల ప్రారంభించడానికి ఛాన్సుంది. అదే జరిగితే.. దేశవ్యాప్తంగా.. టూరిజం భవిష్యత్తును మార్చే గేమ్ ఛేంజర్ ఇదే అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.