రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

Updated on: Jan 24, 2026 | 7:32 PM

ఒక కుటుంబం ఏఐ (కృత్రిమ మేధస్సు) సహాయంతో రూ. 78 లక్షల ఆసుపత్రి బిల్లును ఆడిట్ చేసి, రూ. 56 లక్షలు ఆదా చేసుకుంది. ఏఐ డూప్లికేట్ ఛార్జీలు, అధిక బిల్లులు, ఉపయోగించని వస్తువుల ఖర్చులను గుర్తించి, అధికారిక లేఖను సిద్ధం చేసింది. దీనితో ఆసుపత్రి యాజమాన్యం బిల్లును రూ. 21.4 లక్షలకు తగ్గించింది. ఏఐను ఇలా తెలివిగా ఉపయోగించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ఓ కుటుంబం ఏఐని ఉపయోగించి ఏకంగా రూ.56 లక్షల ఆసుపత్రి ఖర్చును తగ్గించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి 10 రోజుల చికిత్సకు రూ.78 లక్షల బిల్లు వచ్చింది. తెలివిగా ఏఐ సహాయంతో మెడికల్ బిల్లును ఆడిట్ చేయగా, డూప్లికేట్ ఛార్జీలు, అధిక బిల్లులు వంటి లోపాలు బయటపడ్డాయి. ఏఐ సిద్ధం చేసిన అధికారిక లేఖతో ఆసుపత్రి యాజమాన్యం రూ.78 లక్షల బిల్లును రూ.21.4 లక్షలకు తగ్గించింది. దీంతో ఆ కుటుంబానికి రూ.56 లక్షలు ఆదా అయ్యాయి. ఓ కుటుంబం తెలివిగా ఆలోచించి హాస్పిటల్‌ బిల్లు విషయంలో ఏఐ సహాయం తీసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ప్రతీ మెడికల్ బిల్లును, అందులోని ప్రతీ లైన్‌ను ఏఐకు అందించి.. ఆ మొత్తం మెడికల్ బిల్లును ఆడిట్ చేయాలని కోరారు. దానికి సరైన విధానంలో ప్రాంప్టింగ్ ఇచ్చారు. క్షణాల్లో ఆ బిల్లులోని లోపాలను ఏఐ గుర్తించి బయటపెట్టింది. డూప్లికేట్ ఛార్జీలు, కోడ్ స్టాకింగ్, కన్జ్యూమబుల్స్ పేర్లతో రూ.లక్షలు అధికంగా బిల్లు వేశారని తేలింది. ఒకేదానికి రెండుసార్లు బిల్లు వేయడం.. నిబంధనల ప్రకారం కాకుండా చికిత్సలకు వేర్వేరుగా వేసి బిల్లును పెంచేందుకు ప్రయత్నించారు. ఇక ఆ పేషంట్‌కు ఉపయోగించని వస్తువులకు కూడా అధిక ధరలు వేసినట్లు ఏఐ బయటపెట్టింది. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత.. చట్టపరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ ఏఐ ఒక అధికారిక లేఖను కూడా సిద్ధం చేసి ఇచ్చింది. ఆ లెటర్‌ చూసిన ఆస్పత్రి యాజమాన్యం షాకైంది. దాన్ని మొత్తం చదివి.. బిల్లును మొత్తం పరిశీలించింది. 3 రోజుల తర్వాత సవరించిన బిల్లును పంపించింది. మొదట రూ.78 లక్షలు వేసిన ఆ మెడికల్ బిల్లును ఏకంగా రూ.21.4 లక్షలకు తగ్గిస్తూ ఫైనల్ బిల్లు ఇచ్చింది. దీంతో ఆ కుటుంబానికి రూ.56 లక్షలు అధికంగా చెల్లించే బాధ తప్పింది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఏఐని ఇలా కూడా వాడొచ్చా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద అమెరికా అణు రియాక్టర్‌

సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు

Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ

Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్