Watch Video: అప్పుడే రామరాజ్యం మన ఇంట్లో ఏర్పడుతుంది.. గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
సంపాదనకు ప్రాధాన్యత తగ్గిపోయినాడు.. సంస్కారానికి ప్రాధాన్యత పెరిగిననాడు రామరాజ్యం మన ఇంట్లో ఏర్పడుతుందని ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అన్నారు. యువతరంతో పాటు పెద్దతరం కూడా దీన్ని గ్రహించాలని సూచించారు. శ్రీరామ నవమి సందర్భంగా టీవీ9 నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో..
సంపాదనకు ప్రాధాన్యత తగ్గిపోయినాడు.. సంస్కారానికి ప్రాధాన్యత పెరిగిననాడు రామరాజ్యం మన ఇంట్లో ఏర్పడుతుందని ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అన్నారు. యువతరంతో పాటు పెద్దతరం కూడా దీన్ని గ్రహించాలని సూచించారు. శ్రీరామ నవమి సందర్భంగా టీవీ9 నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరాముడు, రామరాజ్యం విశిష్టత గురించి గరికపాటి మాట్లాడారు. బాధ్యతలు స్వీకరించడం ఇష్టంలేకపోవడమే భారతీయ కుటుంబ వ్యవస్థ బలహీనపడానికి కారణం అవుతోందన్నారు. యువతరం ఇలా తయారుకావడానికి పెద్దతరానిదే బాధ్యతగా పేర్కొన్నారు. ఉద్యోగపరంగా ఆదాయం కంటే దేశానికి ఏది మంచిదన్నది ముఖ్యమన్నారు.