గూడ్స్ రైలులో గ్యాస్ లీక్.. ఆ తర్వాత

Updated on: Mar 05, 2026 | 12:16 PM

శ్రీకాకుకుళం జిల్లా తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో విశాఖపట్నం HPCL నుండి వస్తున్న గ్యాస్ గూడ్స్ రైలు నుండి గ్యాస్ లీక్ అయింది. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో గుర్తించి, రైలును నిలిపివేశారు. వివిధ శాఖల అధికారులు వెంటనే స్పందించి, లీకేజీని అరికట్టారు. దీంతో భారీ ప్రమాదం తప్పి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది.

జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం HPCL రిఫైనరీ నుండి హౌరా వైపు వెళ్తున్న గ్యాస్ గూడ్స్ రైలులోని ఒక వ్యాగన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ముప్పు తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సమీపంలో ప్రయాణిస్తుండగా, రైలు ఇంజన్ నుండి 16వ వ్యాగన్ పైభాగంలో గ్యాస్ లీక్ అవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు లీక్ అయిన వ్యాగన్ వెనుక ఉన్న బోగీలను వేరు చేసి, ఇంజన్‌ను కొంత ముందుకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నిపుణులైన టెక్నీషియన్ల సహాయంతో లీకేజీని అరికట్టారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే రైలును తిరిగి పంపించారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. అధికారులు సకాలంలో స్పందించడం వల్ల భారీ అగ్నిప్రమాదం జరగకుండా నివారించగలిగారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Follow Us