Shikhar Dhawan: మాజీ భార్య నుంచి శిఖర్ ధావన్‌కి రూ. 5.72 కోట్లు
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు కోర్టు పెద్ద ఊరటనిచ్చింది. మాజీ భార్య ఐషా ముఖర్జీ ఆస్ట్రేలియా కోర్టు ద్వారా పొందిన రూ. 5.72 కోట్లను తిరిగి చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఇచ్చిన ఆదేశాలు భారత చట్టాలకు అనుగుణంగా లేవని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ధావన్ ఆర్థిక వివాదానికి ముగింపు పలికి, కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.
తన ప్రియురాలు సోఫీ షైన్ ను పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు కోర్టు శుభవార్త చెప్పింది. ఆస్తి వివాదం కేసులో మాజీ భార్య ఐషా ముఖర్జీ.5.72 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. 2023లో విడాకుల తర్వాత జరిగిన న్యాయపోరాటంలో ధావన్‌కు విజయం దక్కింది. ఆస్ట్రేలియా పౌరురాలైన అయేషా ముఖర్జీ, అక్కడి కోర్టును ఆశ్రయించి ఆస్తుల పంపకం కోరింది. శిఖర్ ధావన్ ఆమెకు రూ. 5.72 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు భారత చట్టాలకు అనుగుణంగా లేవని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న ప్రాపర్టీ సెటిల్‌మెంట్ విధానంతో భారత న్యాయవ్యవస్థకు సంబంధం లేదని తెలిపింది. భారత వివాహ చట్టాల ప్రకారం ఇలాంటి ఆదేశాలకు చట్టబద్ధత లేదని ఆ మొత్తాన్ని తిరిగి ధావన్‌కు చెల్లించాలని ఆదేశించింది. ఇదే ఢిల్లీ కోర్టు 2023లో ధావన్‌కు మానసిక వేధింపుల కారణంగా విడాకులు మంజూరు చేసింది. ఆ సమయంలో కుమారుడు జొరావర్‌ను దూరం పెట్టడం వల్ల ధావన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని కోర్టు గుర్తించింది. తాజాగా కోర్టు తీర్పుతో, గత కొన్ని సంవత్సరాలుగా వెంటాడిన ఆర్థిక వివాదానికి ముగింపు పలికినట్టైంది. ఈ ఆర్థిక వివాదం ముగియడంతో ధావన్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్టైంది. సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న ఫేక్ కోట్స్, క్లిక్‌బైట్ పోస్టులపై ధావన్ స్పందించాడు. పాజిటివిటీనే తన జీవిత మంత్రంగా తీసుకుంటానని స్పష్టం చేశాడు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా శిఖర్ ధావన్ ముందడుగు వేసినట్టుగా అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్ ఫ్రెండే.. దగ్గరుండి డ్రగ్స్ డాన్‌ను పట్టించింది
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్ 9 విశేషాలు..
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
