ప్రపంచ స్టార్ అయినా.. స్వదేశంలో బుల్లెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణం వీడియో
క్రికెట్‌లో ఒకసారి పేరు వస్తే కోట్లలో వచ్చి పడే డబ్బు హాయిగా సాగిపోయే జీవితం సొంతం అనుకుంటారు చాలా మంది. కానీ, అఫ్గానిస్తాన్ క్రికెట్‌లో టాప్ స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా ఉన్న రషీద్ ఖాన్ జీవితం మాత్రం అందుకు వ్యతిరేకం. తన సెలబ్రిటీ హోదా విలాసాలను ఇవ్వలేదనీ తాజాగా తెలిపారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ తన స్వదేశం ఆఫ్ఘనిస్థాన్‌లో ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను చెప్పారు.
కాబూల్ వీధుల్లో సాధారణ వ్యక్తిలా నడవలేని పరిస్థితి తనదని, భద్రత కోసం బుల్లెట్‌ప్రూఫ్ కారు తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోందని అన్నారు. పీటర్సన్ “నువ్వు కాబూల్‌లో స్వేచ్ఛగా తిరగగలవా?” అని అడగగానే రషీద్ “లేదు” అని సూటిగా సమాధానం చెప్పారు. “నాకు బుల్లెట్‌ప్రూఫ్ కారు ఉంది” అన్న రషీద్ మాటలకు పీటర్సన్ ఆశ్చర్యపోయారు. ఎందుకని ప్రశ్నించగా, “భద్రత కోసమేననీ తగని స్థలంలో, తగని సమయంలో ఉండకూడదనీ ఆఫ్ఘనిస్థాన్‌లో ఇది చాలా సాధారణమే” అని తెలిపారు. రషీద్‌కు ఆ కారు విలాసం కాదు. అది అతని ప్రాణ రక్షణకు అవసరం. రాజకీయ అస్థిరత, భద్రతా సమస్యలున్న దేశంలో జీవించడమంటే ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండటమే.కనీస భద్రత లేక ఆఫ్ఘన్ ప్రజలు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
