బంగ్లా ప్లేయర్లను ఆడిస్తే, గ్రౌండ్ లోకి దూసుకొస్తాం

Updated on: Jan 02, 2026 | 5:34 PM

ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేయడంతో షారుఖ్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్‌లను అడ్డుకుంటామని శివసేన UBT హెచ్చరించింది. దేవకీ నందన్ ఠాకూర్ ఆ ప్లేయర్‌ను వదిలేసి, 9.2 కోట్లు బంగ్లాదేశ్ హిందువులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను 9.2 కోట్లకు కొనుగోలు చేయడంతో వివాదం రేగింది. ఈ నిర్ణయంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవడంపై షారుఖ్ ఖాన్‌కు దేశం పట్ల ప్రేమ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దేవకీ నందన్ ఠాకూర్ స్పందిస్తూ, ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తొలగించి, అతని కొనుగోలుకు వెచ్చించిన 9.2 కోట్లను బంగ్లాదేశ్‌లోని హిందువుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి