మండే ఎండల్లో చల్లటి వార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు

Updated on: May 03, 2026 | 4:08 PM

ఐఎండీ శుభవార్త! అండమాన్‌కు మే 14న రుతుపవనాలు రానున్నాయి, దేశవ్యాప్తంగా మే నెలలో అధిక వర్షపాతం ఉంటుందని అంచనా. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత, వడగాల్పులు కొనసాగుతాయి. వర్షాలు ముందుగానే వచ్చినా, వేడిమి నుండి పూర్తి ఉపశమనం లభించదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు మండిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 9 గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ విభాగం IMD ప్రజలకు తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 14 నాటికే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే సూచనలు ఉన్నాయి. మే 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్‌ దీవులను తాకొచ్చు. మే 14 నుంచి 20 మధ్య అండమాన్స్‌ దీవులలో రుతుపవన వర్షాలు మొదలవుతాయి. భారత ప్రధాన భూభాగం వైపు రుతుపవనాల ప్రయాణంలో ఇది కీలకం కానుంది. అంటే ఇది సాధారణ సమయం కంటే కొద్ది ముందే కావడం విశేషం. దీంతో మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలకు అవకాశం ఉంది. కానీ, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే, మే నెలలో పగలు మాత్రమే కాదు, రాత్రి వేళల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో తేమతో కూడిన వేడి గాలి వల్ల ఉక్కపోత ఎక్కువ ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా మే చివరి వారం లేదా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. మే నెలలో దేశ సగటు వర్షపాతం సాధారణం కంటే 110 శాతం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే తూర్పు, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.వర్షాల సూచన ఉన్నప్పటికీ, వేడి విషయంలో ఊరట అంతంతమాత్రంగానే ఉండనుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. “అధిక వర్షాల అంచనాతో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. దీనివల్ల రాత్రిపూట వేడి బయటకు పోదు. దీనివల్ల రాత్రులు వెచ్చగా ఉంటాయి” అని మహాపాత్ర వివరించారు. మరోవైపు గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తూర్పు తీర రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అధిక తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. కేరళకు రుతుపవనాల రాక తేదీని మే చివరి వారంలో ప్రకటిస్తామంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!

Monalisa Bhosle: ఆ నలుగురిపై కేసు పెట్టిన మోనాలిసా

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Follow Us