ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం

Updated on: May 16, 2026 | 1:12 PM

ఫ్రిజ్‌లో కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా? అయితే ఒక చిన్న పొడి స్పాంజ్ మీ సమస్యకు సింపుల్ సొల్యూషన్ కావచ్చు. వెజిటబుల్ డ్రాయర్‌లో స్పాంజ్ ఉంచడం వల్ల అదనపు తేమను అది పీల్చుకుని కూరగాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చేస్తుంది. ఆకుకూరలు, టమాటాలు, పచ్చిమిర్చి వంటి త్వరగా పాడయ్యే పదార్థాలకు ఈ చిట్కా ఎంతో ఉపయోగకరం.

ఉరుకులు పరుగుల జీవితంలో రోజూ మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే సమయం ఉంటడం లేదు. ఇప్పుడంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నాయి అనుకోండి. కానీ చాలామంది మార్కెట్‌ నుంచి వారానికి సరిపడా తాజా కూరగాయలు తెచ్చుకొని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే రెండు రోజులు గడవకముందే వాటిలో ఆకుకూరలు వాడిపోవడం , టమాటాలు కుళ్ళిపోవడం చాలామందిని వేధించే సమస్య. ఖరీదైన రిఫ్రిజిరేటర్లు ఉన్నా ఈ ఇబ్బంది తప్పడం లేదు. అయితే, వంటగదిలో ఉండే ఒక చిన్న పొడి స్పాంజ్ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపుతుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న లాజిక్ తెలిస్తే మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు! చాలామంది ఫ్రిజ్ చల్లగా ఉంటే కూరగాయలు తాజాగా ఉంటాయని భావిస్తారు. కానీ కూరగాయలు త్వరగా పాడవడానికి అసలు కారణం తేమ . ఫ్రిజ్ లోపల, ముఖ్యంగా వెజిటబుల్ బాక్స్‌లో తేమ ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ తేమ వల్ల బ్యాక్టీరియా, బూజు త్వరగా వృద్ధి చెంది ఆకుకూరలు కుళ్ళిపోయేలా చేస్తాయి. అలాంటప్పుడు మనం ఇంట్లో పాత్రలు కడగటానికి వాడే ఒక చిన్న స్పాంజ్‌ మనకెంతో బాగా ఉపయోగపడుతుంది. దీనికి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. దీన్ని కూరగాయల డ్రాయర్‌లో ఉంచడం వల్ల బాక్స్‌లో పేరుకుపోయే అదనపు తేమను ఈ స్పాంజ్ వెంటనే పీల్చుకుంటుంది. దీనివల్ల కూరగాయల చుట్టూ పొడి వాతావరణం ఏర్పడి అవి వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. అంతే కాదు, ఫ్రిజ్‌లో వచ్చే రకరకాల ఆహార పదార్థాల వాసనలను కూడా ఈ స్పాంజ్ పీల్చుకుని, ఫ్రిజ్ లోపల మంచి వాతావరణం ఉండేలా చేస్తుంది. డ్రాయర్ అడుగున నీరు నిలవకుండా చూడటం వల్ల ఫ్రిజ్‌ను తరచూ శుభ్రం చేయాల్సిన శ్రమ తగ్గుతుంది. ఒక కొత్త పొడి స్పాంజ్‌ను తీసుకోండి. దాన్ని కూరగాయల డ్రాయర్ మూలల్లో లేదా పక్కన ఉంచండి . ముఖ్య విషయం..కూరగాయల పైన నేరుగా పెట్టకూడదు సుమా. తేమ ఎక్కువగా ఉంటే రెండు స్పాంజ్‌లను కూడా వాడవచ్చు. స్పాంజ్ తడిగా మారినట్లు అనిపిస్తే, దాన్ని బయట తీసి పిండి ఆరబెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, స్ట్రాబెర్రీలు వంటి త్వరగా పాడయ్యే వాటికి ఈ చిట్కా ఒక వరం లాంటిది. ఖరీదైన కంటైనర్లు కొనే పని లేకుండా, కేవలం ఐదు రూపాయల స్పాంజ్‌తో మీ కూరగాయలను తాజాగా ఉంచుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు

వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే

నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్! వైరల్ అవుతున్న ‘సెలూన్ ఏటీఎం’ కథ

Follow Us