ప్రస్తుతం పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 699కే సొంతం చేసుకోవచ్చు. ఇక నెలవారీ రీఛార్జ్ విషయంలో కూడా ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌ను అందిస్తోంది. ప్రతీ నెల కేవలం రూ. 123తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. అదే విధంగా 14 జీబీ డేటాను పొందొచ్చు. తక్కువ బడ్జెట్‌లో 4జీకి అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్న వారికి జియో భారత్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే జియో భారత్ ఫోన్‌లో లైవ్ టీవీ చూడొచ్చు. 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. డిజిటల్ చెల్లింపులు కూడా చేసుకునే వీలు ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. జియోపే ద్వారా పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. జియోపే, జియోఛాట్ వంటి ప్రీలోడెడ్ యాప్‌లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. జియో మార్ట్ యాప్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.