అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఘన విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో భాగంగా, పెద్ది చిత్ర బృందం అనాథ పిల్లలకు రామ్ చరణ్ సంతకాలు చేసిన ప్రత్యేక క్రికెట్ బ్యాట్‌లను బహుమతిగా ఇచ్చింది. ఈ సర్ప్రైజ్‌తో ఆ చిన్నారుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మంచి పనికి అందరి ప్రశంసలు లభించాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది జూన్ 04న విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న చిత్ర బృందం, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే సదాశయంతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పెద్ది సినిమా టీమ్ అనాథాశ్రమాల్లోని పిల్లలకు మర్చిపోలేని బహుమతిని అందజేసింది. చిత్రంలో రామ్ చరణ్ ఉపయోగించిన ఒరిజినల్ బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన రెప్లికాలను యూనిట్ తయారు చేయించింది. అంతేకాకుండా, ఈ బ్యాట్‌లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేత స్వయంగా సంతకాలు చేయించారు. ఈ స్పెషల్ బ్యాట్‌లను అనాథ ఆశ్రమాల్లోని చిన్నారులకు పంపిణీ చేశారు. రామ్ చరణ్ పంపిన ఈ అనూహ్య బహుమతితో ఆ పిల్లల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
మరిన్ని వీడియోల కోసం :
Published on: Jun 27, 2026 08:38 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
