వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
వేసవిలో బంగాళాదుంపలు అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. నూనెలో వేయించినవి మరింత హానికరం. బదులుగా, ఉడికించిన బంగాళాదుంపలను తక్కువ మసాలాతో, పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
బంగాళాదుంప అంటే ఇష్టపడని వారుండరు. కూరగాయల రాజుగా పిలిచే ఈ దుంపతో ఏ వంటకం చేసినా లొట్టలేసుకుని తింటారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భానుడి భగభగలు మొదలైన ఈ వేసవి కాలంలో బంగాళాదుంపలను అతిగా తినడం అంత మంచిది కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. వేసవిలో మన శరీరం ఇప్పటికే బయటి వేడి వల్ల ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటి సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, జీర్ణక్రియ నెమ్మదించి శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండల సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త సున్నితంగా మారుతుంది. బంగాళాదుంపలు తిన్నప్పుడు కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా దట్టించిన బంగాళాదుంప కూరలు వేసవిలో కడుపులో మంటకు దారితీస్తాయి. సమ్మర్‌లో బంగాళాదుంపలను నూనెలో వేయించి తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. నూనెలో వేయించిన దుంపలు శరీరానికి మరింత వేడిని కలిగిస్తాయి. మీకు బంగాళాదుంపలు తినాలనిపిస్తే, వాటిని నూనెలో వేయించకుండా కేవలం ఉడికించి తక్కువ మసాలాతో తీసుకోవడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు