AP Politics: ‘పవన్ మానసిక స్థితి ఏంటో అర్థం కావట్లా..’ గ్రంథి కౌంటర్
పవన్ తనను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరమన్నారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. వీడియో చూడండి...
భీమవరంలో రాజకీయ మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీ రాజకీయం చేస్తున్నారని, ఈసారి ఎలాగైనా భీమవరంలో గెలిచి తీరాల్సిందే అన్నారు జనసేన అధినేత. మంగళవారం పవన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో పవన్ రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ మానసిక స్థితి ఏంటో అర్థం కావడం లేదని, ఆయన మంచోడైతే.. జేడీ లాంటి మేధావులు ఎందుకు దూరం అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు.
భీమవరం ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నారన్న.. పవన్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రౌడీలా పవనే మాట్లాడుతున్నారని, ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు గ్రంథి. జనసేన పార్టీ కార్యాలయానికి భీమవరంలో స్థలం ఇవ్వకుండా అడ్డుకున్నారని పవన్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు భయపడే ఎవ్వరూ ముందుకు రాలేదనడంపై ఫైర్ అయ్యారు గ్రంథి శ్రీనివాస్. పవన్‌కు స్థలం కావాలంటే.. తన భూమి నుంచి ఇచ్చేవాడినని చెప్పారు. పవన్ నిజస్వరూపం తెలిసిన రోజు ఆయనతో ఎవ్వరూ ఉండరన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..