WITT Global Summit: ఇండియా కూటమితో ఒరిగేదేమీ లేదు.. అనురాగ్ ఠాకూర్ వ్యంగ్యాస్త్రాలు

Updated on: Feb 25, 2024 | 8:11 PM

వాట్ ఇండియా టుడే థింక్స్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఇండియా కూటమి పక్షాలపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడం ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు.

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహించిన వాట్ ఇండియా టుడే థింక్స్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఇండియా కూటమి పక్షాలపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడం ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు. జీరో ప్లస్ జీరో ఏమి అవుతుందో అందరికీ తెలుసని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ఎన్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుందని, దీన్ని సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని అడ్డుకునేందుకు గతంలో కూడా విపక్షాలు కలిశాయని.. అయితే దాని ద్వారా ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకపోయారని ధ్వజమెత్తారు.

WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..