CM KCR: యాదాద్రికి కుటుంబసమేతంగా వచ్చిన కేసీఆర్‌.. పూజల్లో పాల్గొన్న సీఎం మనువడు హిమాన్షు

|

Sep 30, 2022 | 3:02 PM

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సీఎం కేసీఆర్ విరాళంగా ఇచ్చారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సీఎం కేసీఆర్ విరాళంగా ఇచ్చారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో యాదగిరిగుట్టకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. దసరాకు కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో పర్యటనపై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం సీఎంతో పాటు స్వామివారిని దర్శించుకున్నారు.

 

Published on: Sep 30, 2022 02:54 PM