Telangana: తెలంగాణ ఎన్నికలపై కీలక అప్డేట్.. షెడ్యూల్‌ ప్రకారమే

|

Sep 23, 2023 | 4:05 PM

EVMల తనిఖీ జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అక్టోబర్‌ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటన ఉంటుందని చెప్పారు.

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తాజాగా అనౌన్స్ చేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలకు రెడీ అవుతుంది ఈసీ. వచ్చే నెల 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉండనుంది. ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు వికాస్‌రాజ్. 4వేల భవనాలను పోలింగ్‌ కోసం గుర్తించింది ఎన్నికల కమీషన్.  కేంద్ర – రాష్ట్ర పరిధిలోని 20 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు విధుల్లో పాల్గొననున్నాయి. జిల్లాల్లో అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉంటుందన్నారు. GHMC పరిధిలో అడ్రస్ మార్పుల కంప్లైంట్స్ వచ్చాయన్న ఆయన.. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

 

Published on: Sep 23, 2023 04:05 PM