CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం

Updated on: May 10, 2026 | 5:43 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, తొలి సంతకాన్ని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేశారు. అనంతరం యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్, మహిళా రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై సంతకాలు చేసి, లౌకికవాదం, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ప్రకటించారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. అనంతరం యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్‌ , మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై సంతకాలు పెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన తొలి ప్రసంగం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి నిలిచిన యువతపై విజయ్ ప్రత్యేకంగా తన ప్రేమను కురిపించారు. “యువత నాపై చూపిన నమ్మకమే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ ‘విజయ్ మామ’ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేవలం నాయకుడిని మాత్రమే కాదని, ప్రతి ఇంట్లో అన్నలా, తమ్ముడిలా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని భరోసా ఇచ్చారు. విజయ్ తన లౌకికవాద దృక్పథాన్ని స్పష్టం చేస్తూ.. “హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఈ మూడు మతాల ముఖమే నా ముఖం. నేను అందరివాడిని” అని పేర్కొన్నారు. చీకటి రాజకీయాలకు స్వస్తి పలికి, ఏదైనా సరే ప్రజల ముందు నేరుగా మాట్లాడతానని, పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, తన ప్రభుత్వంలో ఒకటే ‘పవర్ సెంటర్’ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచేందుకు త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. తాము ఏదో చేసేస్తామని అబద్ధపు హామీలు ఇవ్వమని, ఏది సాధ్యమో అదే చేస్తామని తెలిపారు. తాను దేవదూతను కాదని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని, తనకూ ఆకలి, పేదరికం తెలుసు అని వాస్తవిక దృక్పథంతో మాట్లాడారు. టీవీకే కార్యకర్తల కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రులైనా.. శత్రువులైనా.. అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం వర్తిస్తుందని.. బంధుప్రీతికి తావులేదని తేల్చిచెప్పారు. టీవీకేలో ఒకేఒక అధికార కేంద్రం ఉందని.. అదే విజయ్ అని వెల్లడించారు. తమిళ ప్రజలందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని విజయ్ పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తనకు, విషయాలు పూర్తిగా నేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. విజయ్ ప్రసంగం తమిళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

Published on: May 10, 2026 05:41 PM
Follow Us