President Phone Call: తెలంగాణ జడ్చర్ల వాసికి రాష్ట్రపతి ఫోన్‌..!(Video)

Updated on: Sep 14, 2021 | 9:26 AM

ఒక సామాన్య వ్యక్తికి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఫోన్‌ చేసారు. పలు విషయాలపై ఆయనతో చర్చించారు. త్వరలోనే అతనిని కలుస్తానని కూడా చెప్పారు. తెలంగాణలోని జడ్చర్లకు చెందిన అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వయంగా ఫోన్‌చేశారు. ఎందుకో ఏమిటో చేసేద్దామా..

తెలంగాణ జిల్లాకు చెందిన అనిల్‌ అనే ఓ సామాజికవేత్తకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోన్‌ చేశారు. అనేక విషయాలపై అతనితో మాట్లాడారు. త్వరలోనే అతనిని కలుస్తానని ఆఫర్‌ కూడా ఇచ్చారట. అసలు విషయం ఏంటంటే.. జడ్చర్లలోని గాంధీ ట్రస్టులో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2న ఆవిష్కరించనున్నారు. ఇందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల ను ఆహ్వానిస్తూ పోస్టు ద్వారా ఆహ్వాన పత్రాలను పంపించారు అనిల్ కుమార్. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

Published on: Sep 14, 2021 09:25 AM