Watch Video: జనసేన.. ప్రజారాజ్యం పార్ట్‌-2 అవుతుంది.. పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్..

|

Apr 08, 2024 | 3:32 PM

జనసేనకు పోతిన మహేష్‌ గుడ్‌ బై చెప్పేశారు. పవన్‌ను నమ్మి నట్టేట మునిగాం అన్నారాయన. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ పోతిన మహేష్‌.. ఫైనల్‌గా జనసేనకు గుడ్‌ బై చెప్పేశారు. పార్టీని వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసేన.. ప్రజారాజ్యం పార్ట్‌-2 అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేనకు పోతిన మహేష్‌ గుడ్‌ బై చెప్పేశారు. పవన్‌ను నమ్మి నట్టేట మునిగాం అన్నారాయన. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ పోతిన మహేష్‌.. ఫైనల్‌గా జనసేనకు గుడ్‌ బై చెప్పేశారు. పార్టీని వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసేన.. ప్రజారాజ్యం పార్ట్‌-2 అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ చేతులోకి వెళ్లిపోతుందని చెప్పారు. నాగబాబుకు టికెట్ కేటాయించకపోవడం పొత్తు ధర్మం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇక నాదెండ్ల మనోహర్‌.. జనసేన పార్టీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. ‘‘జనసేనకు ఆవేశంతోనో, సీటు రాలేదనో రాజీనామా చేయలేదు. కొత్తతరం నేతల్ని పవన్‌ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్‌తో నడిచి భంగపడ్డాం. పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్‌పైగానీ పవన్‌ ఏనాడూ దృష్టి పెట్టలేదు. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..