Watch Video: ఏపీ మంత్రిగా పవన్ ప్రమాణస్వీకారం.. అన్నకు తమ్ముడి పాదాభివందనం..

|

Jun 12, 2024 | 1:22 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి వేదికపై గవర్నర్ సమక్షంలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ సహా పలువురు కీలక మంత్రులు, వీవీఐపీలు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాన మంత్రి మోదీ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి వేదికపై గవర్నర్ సమక్షంలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ సహా పలువురు కీలక మంత్రులు, వీవీఐపీలు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాన మంత్రి మోదీ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత తన అన్నయ్య మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మధుర క్షణాల్లో చిరంజీవి పాదాభివందనం చేశారు. దీంతో వేదికపై కాస్త భావోద్వేగభరిత వాతావరణం కనిపించింది. వేదిక ముందు కూర్చున్న అభిమానులందరూ పవన్ గౌరవానికి ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లిన సందర్భంగా కూడా తన అన్న కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం లైవ్ అప్డేట్స్…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Published on: Jun 12, 2024 12:21 PM