TS Politics: తండ్రి, కొడుక్కి 2 టికెట్లు ఎలా ఇస్తారని కొందరు నేతల అభ్యంతరం

|

Sep 23, 2023 | 1:37 PM

కాంగ్రెస్ పార్టీలో చేరికల హడావిడి కనిపిస్తోంది. పార్టీలో చేరేందుకు ఒక్కక్కరుగా ఢిల్లీచేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, రేఖానాయక్‌ ఉన్నారు. మైనంపల్లి ఫ్యామిలీపై కాంగ్రెస్‌లో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తండ్రి హనుమంతరావు, కొడుకు రోహిత్‌లకు రెండు టికెట్లు ఇవ్వలేమంటోంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై స్పీడు పెంచింది హస్తం పార్టీ. ఇప్పటికే 70 స్థానాల్లో అభ్యర్ధులపై కొలిక్కి వచ్చింది కసరత్తు. ఫైనల్‌ చేసిన జాబితాను అధిష్టానానికి నివేదించింది స్క్రీనింగ్ కమిటీ. జాబితాను పరిశీలించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేస్తుంది. మిగతా స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు ఢిల్లీకి క్యూ కట్టారు ఆశావాహులు. అదిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికల హడావిడి కనిపిస్తోంది. పార్టీలో చేరేందుకు ఒక్కక్కరుగా ఢిల్లీచేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, రేఖానాయక్‌ ఉన్నారు. మైనంపల్లి ఫ్యామిలీపై కాంగ్రెస్‌లో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తండ్రి హనుమంతరావు, కొడుకు రోహిత్‌లకు రెండు టికెట్లు ఇవ్వలేమంటోంది కాంగ్రెస్ పార్టీ. ఉదయపూర్‌ తీర్మానాన్ని ప్రస్తావిస్తున్న పార్టీ నేతలు కుటుంబానికి ఒక్కటే టికెట్‌ అంటున్నారు. కనీసం ఐదేళ్లు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన వారికే రెండో టికెట్‌ ఇవ్వాలని ఉదయపూర్‌ తీర్మానంలో ఉంది.

అటు రేఖానాయక్‌ ఫ్యామిలీపైనా ఉదయ్‌పూర్‌ తీర్మానం ఎఫెక్ట్ పడుతోంది. తనతో పాటు భర్త శ్యామ్‌ నాయక్‌ కు కూడా టికెట్‌ ఇవ్వాలని రేఖానాయక్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరికీ టికెట్లు సాధ్యం కాదంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీలో రెండు టికెట్ల లొల్లిని కాంగ్రెస్‌ పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Published on: Sep 23, 2023 01:36 PM