భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
ఢిల్లీలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల అనంతరం భారత్, రష్యా ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రష్యాను చిరకాల మిత్రదేశంగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఉక్రెయిన్ విషయంలో శాంతి పక్షాన భారత్ నిలబడటం, 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం ఈ చర్చల్లో ప్రధాన అంశాలు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం భారత్, రష్యా ఏడు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రష్యా భారతదేశానికి చిరకాల మిత్రదేశమని, ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు సుదీర్ఘంగా పోరాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
