Minster KTR: వాళ్లంతా ఎవరు..? రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది.. మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

Updated on: Oct 19, 2023 | 5:27 PM

Minster KTR on Rahul Gandhi: తెలంగాణలో కుటుంబపాలన అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి కే తారక రామారావు (కేటీఆర్‌) కౌంటర్‌ స్పందించారు. కుటుంబ పాలనపై రాహుల్‌ మాట్లాడటం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఎవరు..? రాహుల్‌, ప్రియాంక సమాధానం చెప్పాలి..

Minster KTR on Rahul Gandhi: తెలంగాణలో కుటుంబపాలన అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి కే తారక రామారావు (కేటీఆర్‌) కౌంటర్‌ స్పందించారు. కుటుంబ పాలనపై రాహుల్‌ మాట్లాడటం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఎవరు..? రాహుల్‌, ప్రియాంక సమాధానం చెప్పాలి.. అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకుని..అవినీతిపై రాహుల్‌ మాట్లాడటం విడ్డూరం అంటూ విమర్శించారు. పీసీసీ పదవిని కొన్న రేవంత్‌ని పక్కన పెట్టుకుని.. రాహుల్‌ మాపై విమర్శలు చేస్తున్నారు.. కాంగ్రెస్‌ అంటే ఏ టు జెడ్‌ అవినీతి.. అంటూ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..డీసీసీ అధ్యక్షులే చెబుతున్నారు.. కాంగ్రెస్‌ నుంచి గెలిచే ఎమ్మెల్యేలను..రేవంత్‌రెడ్డి బీజేపీకి అమ్మేస్తారన్నారు. మేం బీజేపీ బీటీమ్‌ కాదు.. మీరే సీ టీమ్‌, చోర్ టీమ్.. రేవంత్‌రెడ్డి బీజేపీ కోవర్టు అంటూ మంత్రి కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు.

నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరతీసిన కాంగ్రెస్‌ని నమ్మేదెవరన్నారు మంత్రి కేటీఆర్‌. కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని.. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధిస్తున్నారన్నారు. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్‌ గాంధీపై ఫైర్‌ అయ్యారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ పీసీసీ చీఫ్‌ అన్నారు. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతో పాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

బీజేపీ చెప్పినట్లు బీఆర్‌ఎస్‌ చేస్తోందన్న రాహుల్ ఆరోపణలకు సైతం మంత్రి కౌంటరిచ్చారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచే ఎమ్మెల్యేలను రేవంత్‌ బీజేపీకి అమ్మేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో 2వందల పెన్షన్‌ ఇవ్వడానికే అపోసోపాలు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అలాంటోళ్లు ఇక్కడ 4వేల పెన్షన్‌ ఇస్తామంటే నమ్మతామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలవి బూటకపు హామీలన్నారు కేటీఆర్‌. సీ టీమ్స్‌ వస్తున్నాయని జాగర్త అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఘాటుగా విమర్శలు సంధించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఇవాళ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. పదివేల 3 వందల కోట్ల నిధులతో ‌ దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. 2 లక్షల 25 మంది వాహనాలు సమకూర్చామన్నారు. ఇప్పుడు దివ్యాంగులకు ఇస్తన్న పెన్షన్‌ను 6వేల 16 రూపాయిలకు పెంచుతామని హామీనిచ్చారు కేటీఆర్‌. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దివ్యాంగుల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమపథకాలను చేపట్టిందని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 19, 2023 05:24 PM