Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం

Updated on: Oct 13, 2025 | 2:49 PM

కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతిపై తమిళనాడు బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి మాజీ డీఎంకే నేత సెంథిల్ బాలాజీనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.

కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణమనే దానిపై తమిళనాడు బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, ఈ తొక్కిసలాటకు డీఎంకే మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే కరూర్ లో తొక్కిసలాట జరిగేలా చేసి అమాయకుల ప్రాణాలు తీశారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్ 20 తర్వాత తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జనవరి 10 తర్వాత కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం

ప్రధాని మోదీకి ఆలస్యంగా ఆహ్వానం.. హాజరుపై సందిగ్ధత

నేడు అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం

Follow Us