Hyderabad: బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై మహిళల దాడి.. ఎందుకంటే..?
ఫ్లెక్సీ బ్యానర్ల వివాదంలో హైదరాబాద్ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. మంగళవారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ ప్రాంతంలో తన కారులో వెళుతుండగా వెంగల్‌రావు నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్ జి . దేదీప్యారావుపై కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పుకునే మహిళలు మెరుపుదాడి చేసి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
హైదరాబాద్ వెంగళరావునగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడికి పాల్పడ్డారు స్థానిక మహిళలు. ఈ దాడిలో దేదీప్యరావుకు స్వల్పగాయాలయ్యాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులకు దేదీప్యరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానిక మహిళలు దేదీప్యరావుపై దాడికి దిగారు భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దాడిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దేదీప్యారావు.
దీంతో కాంగ్రెస్ మహిళా నేత భవానీతో పాటు..మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాంగ్రెస్ ఫిర్యాదుతో దేదీప్యపై కూడా కేసు నమోదు నమోదయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని.. బీఆర్ఎస్ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు కార్పొరేటర్ దేదీప్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 13, 2024 11:54 AM