YS Jagan: గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్‌ జగన్‌.. మిర్చి రైతులతో భేటీ.. లైవ్ వీడియో

|

Feb 19, 2025 | 11:19 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు.. జగన్‌ వెంట వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. జగన్‌ రాకతో మిర్చి యార్డుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మిర్చి యార్డుకు చేరుకున్న జగన్ మిర్చిని పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు.. జగన్‌ వెంట వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. జగన్‌ రాకతో మిర్చి యార్డుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మిర్చి యార్డుకు చేరుకున్న జగన్ మిర్చిని పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు.. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక మీడియాతో మాట్లాడనున్నారు వైఎస్‌ జగన్‌.. తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు బయల్దేరిన జగన్‌ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు.

అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి పర్యటనలకు అనుమతి లేదంటూ మిర్చి యార్డ్‌ అధికారులు పేర్కొంటున్నారు. మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్‌లో వార్నింగ్‌ అనౌన్స్‌మెంట్స్‌ కూడా ఇస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు..

అయితే, సభ, సమావేశం లేదు.. కేవలం మిర్చి రైతులతో జగన్‌ మాట్లాడతారంటోంది వైసీపీ.. ఒకవైపు అనుమతి తీసుకోకపోవడం.. మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు పోలీసులు..

Published on: Feb 19, 2025 11:04 AM