Watch Video: అట్లుంటది మరి బాలయ్యతోని.. డ్రైవర్‌గా హిందూపురం ఎమ్మెల్యే
ఇటు సినిమా.. అటు రాజకీయాలు.. రెండింటిలోనూ బాలయ్యది తనదైన శైలి. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో మరోసారి బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారు. స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి ఔరా అనిపించారు. మహిళా ప్యాసింజర్లతో నిండిపోయిన ఆర్టీసీ బస్సును ఏకంగా రెండు కిలో మీటర్ల దూరంపాటు నడిపారు హిందూపురం ఎమ్మెల్యే.
నందమూరి బాలకృష్ణ.. ఇటు సినీ ఇండస్ట్రీ.. అటు పాలిటిక్స్‌లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా, రాజకీయాలు రెండింటినూ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా తన ప్రత్యేకను చాటుకుంటూనే ఉన్నారు. మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని శుక్రవారంనాడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హిందూపురం బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకూ ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు.
బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన బాలయ్య.. తన ట్యాలెంట్‌ను చాటుకున్నారు. విజయవాడలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్యాసింజర్లుగా కనిపించారు. అయితే బాలయ్య మాత్రం ఏకంగా డ్రైవర్ సీట్లోనే కూర్చొన్నారు.