Undavalli on AP Politics: ఏపీ పాలిటిక్స్‌పై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పుంజుకుంటోందంటూ..

Updated on: Dec 23, 2023 | 3:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్ కలవడం టీడీపీకి బలమేనని చెప్పారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని వ్యాఖ్యానించారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని.. అలాంటి అనుభవం జగన్‌కి ఉందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులను మార్చడం సరికాదన్నారు. అప్పులు చేసి పంచిపెట్టడం ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని.. అయితే ఏపీ అసెంబ్లీలో అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.